ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ, చేపట్టిన పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్యే జారె.

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్: అశ్వరావుపేట, నవంబర్ 1 ( రిపోర్టర్ నాగరాజు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐ ఆర్ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో నిజమైన అర్హత కలిగిన ఓటర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఈ అంశంపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పిలుపు మేరకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో రేపు నిర్వహించనున్న భారీ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సహచర ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య,తో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. ఓటు హక్కును కాపాడటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న, ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతుగా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *