
అక్షర ఆయుధం కౌతాళం నవంబర్ 1 న్యూస్: కౌతాళంలో వైఎస్ఆర్సిపి దేశాయి ప్రహ్లాద ఆచారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో తిరుగుతూ అవతారం, పాల్ దినకర్ మాట్లాడుతూ *కూటమి ప్రభుత్వం 2024 లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల గురించి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం
నిరుద్యోగులకు ప్రతినెల 3000 ఇస్తామన్న హామీ ఏమైంది? 2.19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామన్న హామీ ఏమైంది? యువత 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ప్రతినెల 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది ఏమైంది?
బీసీ డిక్లరేషన్ లో 50 సంవత్సరాల నిండిన BC లకు అందరికీ 4000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఏమైంది? బీసీ డిక్లరేషన్ లో ఐదు సంవత్సరాలలో బీసీలకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన హామీలో ఇంతవరకు ఎంత ఖర్చు చేశారు? ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన హామీ ఏమైంది?
. విజయవాడలో హాజ్ హౌస్ నిర్మాణం చేస్తామని చెప్పిన హామీ ఏమైంది? నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు ఖర్చుచేస్తామన్న హామీ ఏమైంది ఇమాము మౌజన్ లకు ప్రతినెల 10000మరియు 5000 గౌరవ వేతనం ఇచ్చిన హామీ ఏమైంది? హజ్ యాత్రకు వెళ్ళే ప్రతి ముస్లిం కి లక్ష రూపాయల సాయం అని ఇచ్చిన హామీ ఏమైంది