డంపింగ్ యార్డు శాశ్వత మూసివేతకై పార్టీలను, పదవులను పణంగా పెట్టి పోరాడాలి.

డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 123వ జ్ఞానమాల జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ మహంకాళి బిక్షు
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ నవంబర్ 01 : జవహర్ నగర్ కాప్రా మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవ హార్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, వారి సంక్షేమం కంటే పార్టీలు, పదవులు ఎక్కువ కాదు అని, 1951లో స్త్రీల హక్కుల కోసం చట్టసభల్లో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో తన న్యాయశాఖ మంత్రిపదవికే రాజీనామా చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ప్రదర్శించిన పోరాట స్పూర్తితో రాంకీ చెత్త డంపింగ్ యార్డు శాశ్వత తొలగింపుకై బీజేపీ ఎం.పి.ఈటేల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అధికార కాంగ్రెస్ డిసిసి ప్రసిడెంట్ వజ్రేష్ యాదవ్ తమ పదవులను పణంగా పెట్టి ఐక్యంగా కలిసి పోరాడాలని డాక్టర్ అంబేద్కర్ 123వ జ్ఞాన మాల కార్యక్రమం సందర్భంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి విజ్ఞప్తి చేశారు. 2026, నవంబర్-1, ఆదివారం రోజు, కీసర సర్కీల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ, బాలాజీనగర్ బస్టాండ్ సెంటర్ లో భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాటకమిటి నిర్వాహకులు మహంకాళి బిక్షు ఆధ్వర్యంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై షేక్ షావలి ప్రసంగించారు. ఆనాడు అంబేద్కర్ తన పదవిని తృణప్రాయంగా అర్పించారు కాబట్టే స్త్రీలకు నేడు ఆస్తి, విడాకులు, దత్తత, గుడిలో ప్రవేశం లాంటి ఎన్నో ఆత్మగౌరవ హక్కులు సాదించి పెట్టారని గుర్తుచేశారు. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల సంక్షేమం కొరకు పై ముగ్గురు తమ పదవులను త్యాగంచేసి, ముందుకు వస్తే, ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికైన ప్రజా ప్రతినిధులు, డిసిసి కాంగ్రెస్ నాయకులు అఖిలపక్ష రాజకీయ వైరుధ్యాలు వీడి, ఎప్పుడు ఏకం కాగలుగుతారా? అని అటు దమ్మాయిగూడ జేఏసి, ఇటు జవహర్ నగర్ జేఏసి లతో పాటు నాలుగు మండలాలకు చెందిన 30 లక్షలమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. డిపిఆర్-మూడువేల కోట్ల నిధుల పేరిట జరిగే రాజకీయ చదరంగంలో బాదిత ప్రజలను పావులుగా చేయడం బాధాకరం అని అన్నారు. పౌర సమాజం యోక్క గౌరవాన్ని, స్వతంత్రతను, జీవనాన్ని ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందని, స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణంలో బతికే హక్కును గుర్తించక పోవడం అంటే రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీం కోర్టే అనేక సందర్భాల్లో ఉద్ఘాటించిందని అన్నారు. అందుకే జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేసి, సైంటిఫిక్ క్యాపింగ్, బయో మైనింగ్ శుద్ది ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన కొనసాగించాలనే ప్రజల ప్రజాస్వామిక, న్యాయమైన డిమాండ్ పరిష్కారానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులైన ఈటేల, మల్లారెడ్డి, వజ్రేష్ గార్లు, విడిగా చేపట్టే విభజన కార్యక్రమాలు, ప్రకటనలు నష్టదాయకమని, ఐక్యంగా ఉద్యమిస్తే సాధ్యం కానిది ఏమిలేదనే నగ్న సత్యం తెలిసిన రాజకీయ విజ్ఞులు, ఇప్పటికైన ఆ దిశగా అడుగులు వేయాలని షేక్ షావలి సూచించారు. చివరలో ప్రజానాట్య మండలి వెంకటాచారి, తెలంగాణ ఉద్యమ కళాకారుడు గజ్జెల రాంచందర్ ప్రదర్శించిన డంపింగ్ యార్డు, మహానీయులపై పాట, మాట విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈపై కార్యక్రమంలో
టిజేఎస్ బద్రగామి అంజినేయులు, సిపిఎం శివన్నారాయణ, పిఓడభ్ల్యూ జయసుధ, జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మహ్మద్ పాషామియా, పిఓడభ్ల్యూ(విముక్తి) గడిపే సునీత, తుమ్మరాణి, ఏఐటియుసి అంబాల ఎల్లయ్య, తెలంగాణ ఉద్యమ మహిళా విభాగం సన్వాల సుచరిత, డివైఎఫ్ఐ కె.బాలు, గడ్డంగిరి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *