కడ్తాల్ నాగర్ కర్నూల్ లో ఏర్పటు చేసిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశం లో పాల్గొన్నా తంబళ్ల రవి.

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్: అశ్వరావుపేట, నవంబర్ 1 ( రిపోర్టర్ నాగరాజు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాగర్ కర్నూల్ జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి ఆలయం దగ్గర నిర్వహించిన, బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశానికి అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి హాజరయ్యారు,​ఈ సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్,గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షులు మన్నలాల రావత్,తల్లోజు ఆచారి తదితర ముఖ్య నాయకుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది,గిరిజనులకు అందుతున్న సంక్షేమ పథకాలు,పోడు భూముల సమస్యలు,ఏజెన్సీ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన అభ్యున్నతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై విస్తృతంగా చర్చించారు,రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో,ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పరిధిలో పార్టీని బూత్ స్థాయి నుండి, బలోపేతం చేసేందుకు మరియు ప్రజాపోరాటాలు నిర్వహించేందుకు, కార్యాచరణను రూపొందించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *