
అక్షర ఆయుధం న్యూస్: నవంబర్ 1 ( బి బుజ్జిబాబు అల్లూరి జిల్లా ప్రతినిధి ): అరకు ప్రాంతంలోని గిరిజన గ్రామాల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అరకు జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి తెలగంజి సోమేశ్వరరావు పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో కుండ గుర్తుపై పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అరకు ప్రాంతంలోని 14 పంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం! మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అవసరం ఉందని పేర్కొన్న సోమేశ్వరరావు, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అరకు ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం కల్పించి కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలగంజి సోమేశ్వరరావు ప్రజలను కోరారు.
