ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

🖨️ Print

అక్షరాయుధం న్యూస్ నవంబర్ 1: అనంతపురం జిల్లా యాడికి మండలం రిపోర్టర్ రవితేజ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధినేత లయన్ పవన్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన నిరాహార దీక్ష, వారి త్యాగం, రాష్ట్ర సాధనలో వారి పాత్రను వివరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బంగారు బాల, రంగా, రాజేష్ తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *