భారతి నగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో బాకీ,కార్డుల పంపిణీ చేసిన సింధు,ఆదర్శ్ రెడ్డి.

🖨️ Print

రామచంద్రాపురం,మండలం.(ఆగస్టు,2 అక్షరాయుధం,న్యూస్.ఆరట్ల,సుధాకర్)కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న “కాంగ్రెస్ పార్టీ 420 మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరుబాట” కార్యక్రమంలో భాగంగా భారతి నగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో మాజీ కార్పొరేటర్, సింధు,ఆదర్శ్ రెడ్డి బాకీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, వాటి కింద లబ్ధిదారులకు రావాల్సిన బకాయిల వివరాలను ప్రజలకు వివరించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెన్షన్, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వరి,పంటకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, విద్యా భరోసా కార్డు, ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రజలకు గుర్తుచేశారు.వెయ్యి రోజులు – 33 నెలల పాలనలో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల బకాయిలను వెంటనే విడుదల చేయా. ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలి” అని సింధు ఆదర్శ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *