
పెనగలూరు(సెప్టెంబర్ 02),అక్షర ఆయుధం న్యూస్:తప్పులు లేకుండా రీ సర్వే వివరాలు జిల్లా కు పంపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి ఆర్డివో రామ్మోహన్ తెలిపారు. బుధవారం పెనగలూరు తహసీల్దార్ కార్యాలయానికి జేసీ, ఆర్డివో, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు వచ్చారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల పై సమీక్ష నిర్వహించారు. పలు రికార్డులు పరిశీలించి సిబ్బంది కి సలహాలు సూచనలు ఇచ్చారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. తప్పులు లేని ఓటరు జాబితా ను తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పెనగలూరు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత స్పష్టంగా ఉందని చెప్పారు. సిబ్బంది సమస్య ను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి త్వరలో సిబ్బంది ని నియమిస్తామని తెలిపారు. మా భూముల వివరాలు ఆన్ లైన్ చేయాలని వినతి మండల పరిధి లోని వెలగచర్ల రెవెన్యూ విలేజ్ లోని సర్వే నెంబర్ లు – 866,868, 869 లలో మా భూముల వివరాలు ఆన్లైన్ చేయాలని ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా చేయడం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డివో కు లంకయ్య గారి హరి కృష్ణ వినతి పత్రం ఇచ్చారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో లు ఆన్లైన్ చేయాలని లేఖ లు పెనగలూరు తహసీల్దార్ కు పంపినప్పటికి తహసీల్దార్ లు ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం గ వ్యవహరిస్తున్నారని చెప్పారు. కోర్ట్ ఆదేశాలు ఉన్నా, ఉన్నతాధికారులు ఆదేశించిన ఆన్లైన్ చేయకుండా సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీటీ సుమని, ఆర్ ఐ రామ్మోహన్, మండల సర్వేయర్ వాసు దేవ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.