వేర్హౌస్ ను ప్రారంభించిన రెస్కో చైర్మన్ ప్రతాప్..

🖨️ Print

అక్షర ఆయుధం,కుప్పం,సెప్టెంబర్ 02,రిపోర్టర్ : తేజ కిరణ్: గుడిపల్లి మండలంలో వేర్హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద బీసీ మరియు ఓసీ వర్గాలకు 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కడ ప్రతిపాదించిన “స్వర్ణ కుప్పం” విజన్‌లో పేర్కొన్న నెట్-జీరో (కార్బన్-న్యూట్రల్) లక్ష్యానికి అనుగుణంగా, బీసీ మరియు ఓసీ వర్గాలకు చెందిన గృహ వినియోగదారుల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం ద్వారా సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, విద్యుత్ ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.సోలార్ పానెల్స్ ఏర్పాటుకు అవసరమైన సోలార్ పానెల్స్ మరియు సోలార్ సామగ్రి అందుబాటులో ఉంచారు.ఈ కార్యక్రమానికి రెస్కో చైర్మన్ వి.జి. ప్రతాప్ కుమార్, రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్, కడ అడ్వైజర్ ఎస్. రాజ్ కుమార్, రెస్కో ఎండీ సోమశేఖర్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *