దేగుల్‌వాడిలో పంట నమోదు కార్యక్రమం

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ కంగ్టి సెప్టెంబర్,02-2026.(రిపోర్టర్ హెచ్ రాజు)నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రం పరిధిలోని దేగుల్‌వాడి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఇఓ)శ్వేత మేడం పాల్గొని రైతుల నుంచి పంటలకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. పంటల సాగు విస్తీర్ణం, పంట రకం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు ప్రక్రియను చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు పంట నమోదు వివరాలను సక్రమంగా అందించాలని, అధికారులు కోరిన సమాచారాన్ని అందించి నమోదు ప్రక్రియకు సహకరించాలని సూచించారు. పంటల వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు రైతులకు అందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబారి శ్రీనివాస్‌తో పాటు రైతులు బసాపురం మైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిద్ధార్థ్, చాకలి సంజు తదితరులు పాల్గొన్నారు. రైతులు తమ పంటల వివరాలను అధికారులకు అందజేసి నమోదు కార్యక్రమంలో సహకరించారు. గ్రామంలో పంట నమోదు ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పూర్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *