డాక్టర్ చల్లా ఆధ్వర్యంలో ఘనంగా మహానేత,దివంగత సిఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి.

🖨️ Print

అక్షర ఆయుధం రిపోర్టర్ (పాక దుర్గాప్రసాద్) ఆలమూరు:డాక్టర్ వైఎస్సార్ 17 వ వర్ధంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రం ఆలమూరు గ్రామంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న మహానేత,దివంగత సిఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ట్రెజరర్,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు,ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్‌ చల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా డాక్టర్ చల్లా మాట్లాడుతు డాక్టర్ వైఎస్ఆర్ పేదలు,రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సేవకు అంకితమైన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని,ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన సేవలు,సంక్షేమ పథకాలు ఎప్పటికీ స్మరణీయమే అని,ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సాగునీరు, పేదల సంక్షేమం, గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పేదలకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, గ్రామీణ మౌలిక వసతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు ఆయన పాలనతో విస్తృతంగా అనుసంధానించబడ్డాయని,పేదల గృహ నిర్మాణానికి ఇందిరమ్మ కార్యక్రమం కూడా ఆయన ప్రభుత్వ కాలంలో కీలకంగా సాగిందని డాక్టర్ చల్లా అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలమూరు పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ చల్లా లక్ష్మిభూషణం,ఎలుగుబంట్ల ౠరయ్య,శ్రీపతి వీర్రాజు,వెత్సా శ్రీనివాస్,ఎరుకొండ గణేష్,లంకే వెంకటరెడ్డి,నార్గని వీరబాబు,నార్గని సెంథిల్ కుమార్,నాయుడు ప్రసాద్,పాకా శ్రీను (పాస్టర్), ,కుర్మా మమ్మీ, కుర్మా నాని,గూటం మేరీ, గంధం కామేశ్వరి, నేతల అశోక్, కొపనాతి శ్రీరామ్మూర్తి, గేదెల శ్రీను, సత్తి సత్యనారాయణ, రామకృష్ణ, గంగుల రామ్ ప్రసాద్,అయినవిల్లి సూర్యనారాయణ,పితాని మాలశ్రీ,వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *