కోడూరులో అత్యంత వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

*​విశేష ప్రజాదరణ మధ్య 55 కేజీల భారీ కేక్ కటింగ్ *​500 మంది పేదలకు అన్నదానం
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్,తిరుపతి జిల్లా,రైల్వేకోడూరు,సెప్టెంబర్2(కె.శ్రీధర్​)రైల్వే కోడూరు: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు లోజనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని టోల్‌గేట్ సమీపంలో ఉన్న ఇంద్ర బస్ షెల్టర్ వద్ద పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు.​ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ స్థానిక సంస్థల విధివిధానాల కమిటీ సభ్యులు డాక్టర్ యనమల భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 55 కేజీల భారీ కేకును రైల్వే కోడూరు ప్రధాన పురవీధుల గుండా అభిమానుల జయజయధ్వానాల మధ్య భారీ ర్యాలీగా ఇంద్ర బస్ షెల్టర్ వద్దకు తీసుకువచ్చారు. ర్యాలీ పొడవునా పవన్ కళ్యాణ్ నాయకత్వానికి అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు.​జనసేన పార్టీ సీనియర్ నాయకులుతోట మల్లికార్జున్ రావు, ముద్దపోలు సభాపతి, నార్జాల దాశరథి, నల్లంశెట్టి యానాదయ్యల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు, పార్టీ ప్రముఖులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పగడాల మణి ప్రసాద్, గల్లా మణి, శ్రీకారం ప్రకాష్, ఎన్ఆర్ఐ నాయకులు ఎర్రంశెట్టి హరిబాబు, దాసరి పృద్విల సహకారంతో ఈ భారీ కేకును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు.​డాక్టర్ యనమల భాస్కర్ రావు మాట్లాడుతూనాపై నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో బాధ్యతాయుతమైన పదవిని కట్టబెట్టిన ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులంతా సమిష్టిగా శ్రమించి, రైల్వే కోడూరు గడ్డపై జనసేన జెండాను రెపరెపలాడిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.​తోట మల్లికార్జున్ రావు మాట్లాడుతూనియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాంఅని తెలిపారు.​ముద్దపోలు సభాపతి మాట్లాడుతూఇంద్ర బస్ షెల్టర్ వద్ద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించడం మాకు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అశేష జనవాహిని మధ్య విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముద్దపోలు రామసుబ్బయ్య, మర్రీ రెడ్డిప్రసాద్, ఉత్తరాది శివకుమార్, దాసరి వీరేంద్ర, అంకిశెట్టి సుబ్రహ్మణ్యం, కొండేటి మనోజ్, గుర్రంకొండ వంశీ, కోక్కంటి మహేష్, మావిళ్ళ సుబ్బరాయుడు, సవరం సాయి, నగిరిపాటి మహేష్, మైసూర్ వారి పల్లి యువత, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *