గులాబీమయంగా మారిన దేవరకొండ – కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై BRS భారీ ధర్నా

ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మోసం చేసిన 420 కాంగ్రెస్ ప్రభుత్వం - మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఫైర్
🖨️ Print

అక్షర ఆయుధం రిపోర్టర్ రాశిక శ్రీశైలం దేవరకొండ( సెప్టెంబర్ 2) : కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకొండలో నిర్వహించిన భారీ ర్యాలీతో దేవరకొండ పట్టణం పూర్తిగా గులాబీమయంగా మారింది.దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరైన ఈ ర్యాలీకి బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు.ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి మొదలైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా బస్ స్టాండ్ వరకు సాగింది. గులాబీ జెండాలు, నినాదాలతో పట్టణం దద్దరిల్లింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని, ఇది 420 కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, నేనావత్ కిషన్ నాయక్, రమేష్ నాయక్, అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *