బంగారుపాళ్యం పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన బంగారుపాళ్యం పోలీసులు

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ ప్రతినిధి పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ సెప్టెంబర్ 2 సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన బంగారుపాళ్యం ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు గారు మరియు సిబ్బంది*జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు “సురక్షిత మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారుపాళ్యం బస్టాండ్ మరియు మార్కెట్ ప్రాంతంలో బంగారుపాళ్యం ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు గారు, మరియు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్,లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని అధికారులు తెలిపారు.కత్తి. శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ బంగారుపాళ్యం పిఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *