కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్య పాలనపై అచ్చంపేటలో భారీ నిరసన ర్యాలీ బిఆర్ఎస్

🖨️ Print

సెప్టెంబర్ 2 అచ్చంపేట న్యూస్ అక్షర ఆయుధం రిపోర్టర్ కాలూరి మల్లేష్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు అచ్చంపేటలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని నిరసనకారులు తీవ్రస్థాయిలో విమర్శించారు.అచ్చంపేట పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగించారు.100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా అనేక హామీలు నెరవేర్చలేదని నాయకులు ఆరోపించారు. ప్రజల కు ఇచ్చిన వాగ్దానాల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, ప్రజల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై. అచ్చంపేటలో జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీ పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *