వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

ఘనంగా చర్ల లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
🖨️ Print

“అక్షర ఆయుధం న్యూస్” చర్ల మండల రిపోర్టర్ (సెప్టెంబర్ 2): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. చర్ల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కుంజా చంటి, మెడబత్తిన వాసు, ఎస్సీ సెల్ చర్ల మండల అధ్యక్షులు మచ్చ రాజా, పూజారి రమణయ్య, మునిగేలా వెంకన్న, గూడపాటి రంజిత్, చెన్నం పవన్, పాలెం నవీన్ కుమార్, కాయం శ్రీను, కేదారి వంశీ, బొల్లా వినోద్, పరవా శంకర్, సున్నం గంగరాజు, గడ్డం నాగరాజు, పోగల్ల సత్తిబాబు, సిద్ధి సత్యనాధం, రజినీకాంత్, నాగరాజు, సుధాకర్, బిక్షపతి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *