
రుద్రూర్, ఆగస్టు 2 (అక్షర ఆయుధం న్యూస్) : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం కారు కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని నుంచి రుద్రూర్ వైపు వస్తున్న TG09BA6462 అనే నెంబర్ గల కారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీ కొన్నట్లు తెలిపారు. కారులో రుద్రూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. అనంతరం అంబులెన్సులో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.