కుప్పంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..

🖨️ Print

అక్షర ఆయుధం,కుప్పం, సెప్టెంబర్ 02, రిపోర్టర్ : తేజ కిరణ్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుప్పం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ నరేష్ ఆదిత్య ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమాంబ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరున విశేష పూజలు జరిపించి, ఆయన ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి మరింత సేవలు చేయాలని, ఆలయ ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కేక్ కటింగ్ అనంతరం,బారి బైక్ ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు జనసైనికులు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ఒకటో వార్డు సామగుట్టపల్లిలో జనసేన జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసైనికులు, జనసేన వీర నారీమణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *