
అక్షరాయుధం న్యూస్ రిపోర్టర్ కాలిశెట్టి శంకర్రావు సెప్టెంబర్ 2 పార్వతిపురం మన్యం జిల్లాపార్వతిపురం మండలం వార్షిక తనిఖీల్లో భాగంగా పార్వతీపురం మన్యం *జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, సెప్టెంబర్ 02న పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ని సందర్శించారు. జిల్లా ఎస్పీ కి పార్వతీపురం టౌన్ సిఐ బి.వెంకట్రావు పూలమొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. తదుపరి పోలీస్ స్టేషన్ల సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, పోలీస్ స్టేషన్ల లోని ఎస్ హెచ్ ఓ రైటర్, నూతన కంప్యూటర్ గది, సిబ్బంది గదులను మరియు కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదులును, స్టేషన్ యొక్క చుట్టుపక్కల పరిసరప్రాంతాలను పరిశీలించినారు. అదేవిధంగా స్టేషను ప్రాంగణంలో గల వాహనాలు ఏ కేసుల్లో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషను ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ రిజిస్టరును పరిశీలించి, జనరల్ డైరీ, సెంట్రీ బుక్కు, బీటు బుక్కులు, డ్యూటీ రోస్టరు, విలేజ్ రోస్టరు, కేడి చెక్ రిజిస్టరు, క్రైం ఆబ్స్ట్రాక్ట్ , చార్టు, సిడి ఫైల్స్‌ను జిల్లా ఎస్పీ తనిఖీ చేసారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుకోవాలని, ప్రతి అంశాన్ని రికార్డులలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని, రికార్డులు అప్డేట్ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. పోలీసు స్టేషనులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ న్యాయ స్థానాల్లో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సిడీ ఫైల్స్ ను జిల్లా ఎస్పీ పరిశీలించి, కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసారు. స్టేషనులో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నది, వారు ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలీసు స్టేషనులో పని చేస్తున్న పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై,సిబ్బందితో మాట్లాడుతూ వారి దత్త వార్డ్‌ల గురిండి ప్రతీ ఒక్కరిని అడిగి వారి వార్డ్ కి సంభందిత సమాచారం అందరిదగ్గర ఉండాలన్నారు. ప్రజలకు రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, మత్తుపదార్దాల వళ్ళ కలిగే నష్టాల పట్ల ఇంటింటికి మన్యం పోలీస్ కార్యక్రమం ద్వార ప్రతీ గడపకు వెళ్ళి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా పనిచేయాలని, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని, హిస్టరీ షీట్లును పరిశీలించి, చెడు నడత కలిగి, చురుకుగా ఉన్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చెయ్యాలని అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అదేవిధంగా సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ సిఐ బి.వెంకట్రావు, ఎస్సై గోవింద్, సిసి సంతోష్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.