కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1000 రోజులు దాటింది – ఇచ్చిన హామీలు ఎక్కడ?

1000 రోజులు దాటింది ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ? మాట నిలబెట్టుకోండి – హామీలు అమలు చేయండి.మునుగోడు నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్
🖨️ Print

అక్షర ఆయుధం సెప్టెంబర్ 2 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మునుగోడు నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.ప్రజలకు ఆరు గ్యారంటీలు, మహిళలకు ఆర్థిక సహాయం, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడు సంవత్సరాలకు చేరువ అవుతున్న ఈ సమయంలో కూడా అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన విమర్శించారు.గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, పేద కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కంటే, ఇచ్చిన ప్రతి హామీ అమలుపై ప్రజలకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, ఏ హామీ అమలైంది, ఏది పెండింగ్‌లో ఉంది, ఎప్పుడు పూర్తి చేస్తారో వెల్లడించాలని తగరం సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *