అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

🖨️ Print

అక్షరఆయుధంన్యూస్,తిరుపతిజిల్లా,రైల్వేకోడూర్ ,సెప్టెంబర్2(కే.శ్రీధర్)తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఆంధ్రప్రదేశ్ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.​స్థానిక శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం నుండి రాజ్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్, ఆటో ర్యాలీ నిర్వహించారు.రాజ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి పాల్గొన్నారు.​పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు సంక్షేమ సాయాలు అందించారు.​5 మండలాలకు చెందిన 25 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.​పంట నష్టపోయిన 25 మంది రైతులకు రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.​పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 25 మంది విద్యార్థులకు (ఫస్ట్ ర్యాంక్‌కు రూ. 5,000, సెకండ్ ర్యాంక్‌కు రూ. 3,000) నగదు బహుమతులు అందించారు.​25 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు.​100 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, చీరలు పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ… తమ జనసేనాని జన్మదిన వేడుకలను ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ వేడుకల్లో పాల్గొన్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.​రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సంగరాజు రవికుమార్ రాజు తో పాటు ఐదు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *