
పెద్దవంగర/తొర్రూర్/రాయపర్తి,మహబూబాబాద్ జిల్లా,సెప్టెంబర్02(అక్షర ఆయుధం):పెద్దవంగర, తొర్రూర్,రాయపర్తి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మోసపూరిత కాంగ్రెస్ 1000రోజుల పాలనపై నిరసన కార్యక్రమం చేపట్టగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు..ఢిల్లీకి మూటలు మోయడం తప్ప ప్రజలపై అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం గాలికి వదిలేసి గాలి మోటార్లపై తిరగడమే లక్ష్యంగా మారారని మండిపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో అంతర్గత లొసుగులతో అరిగోశపడుతూ సీఎం కుర్చీ ఎప్పుడు ఊడుతుందో తెలియని భయంలో రేవంత్ ఉన్నాడని ఆరోపించారు.ఈ సందర్బంగా బుధవారం మాజీమంత్రి మాట్లాడుతూ.తెలంగాణలో ఒక మోసపూరిత పాలనా నడుస్తుందన్నారు,బంగారు తెలంగాణ దిశగా పోతున్న తెలంగాణని ఇందిరమ్మ రాజ్యం అని కరెంట్ కష్టాలు,యూరియా కొరత,నీళ్ల సమస్యలతో మళ్ళీ తెలంగాణ వెనకబడి పోయిందన్నారు.ఎన్నికల వేల కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు,420హామీలు అని ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి మోసపూరిత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తాం అని చెప్పి నేటికీ 1000 రోజులు అవుతున్న వాటిని అమలు చేయాలనే ధ్యాస లేదు అన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైన సరే హామీలు నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 420 హామీలు గుర్తుచేసేందుకే 420ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన చేస్తున్నాం అన్నారు.ప్రతీ గ్రామాన బాకీ కార్డులు పంచి రేవంత్ రెడ్డి ప్రజలకు ఎంతగా బాకీ పడ్డాడో తెలియజేస్తున్నామన్నారు.ప్రతీ నెల మహిళలకు 2500/-అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 33 నెలలకు గాను 82,500/-బాకీ,వృద్ధులు,బీడీ కార్మికులకు ప్రతినెల4000/-అని మోసం చేసి 33 నెలలకి గాను 66,000/-బాకీ,దివ్యంగులకు ప్రతీనెల 6000/-పింఛన్ 33 నెలలకు గాను 66,000/-వేలు బాకీ,కళ్యాణ లక్ష్మి/షాది ముబారక్ కి లక్షతో పాటు తులం బంగారం అని మోసం చేసి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకమే తీసేసే కుట్ర చేస్తున్నారన్నారు. చదువుకునే ఆడబిడ్డకి ప్రియాంక గాంధీ పేరు చెప్పి స్కూటీ అని చెప్పి మోసం చేసితిరీ,ఫీజు రియాంబర్స్ మెంట్ పేరిట కాలేజీలకు12వేల కోట్లబాకీ,వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతులను మోసం చేస్తివి ఎటుపోయింది నీ రైతు డిక్లరేషన్.?రైతు భరోసా పేరిట 4ఎకరాల రైతుకు 1లక్ష 2వేలు బాకీ పడితివి.2లక్షల రుణమాఫీ అన్నారూ. అది మోసం చేస్తివి.రైతుభీమా అనే గొప్ప పథకం పెట్టిన కెసిఆర్.మరణించిన రైతు కుటుంబానికి ఆర్ధికంగా ఆధుకుంటే ఆ పథకం ప్రీమియం చెల్లించక రైతు బీమా పథకమే అమలు చెయ్యలేని దుర్మార్గపూ పాలనా నడిపించ బడితిరి. పండిన ప్రతీ పంటకి500/-బోనస్ అని చెప్పి బోగస్ మాటలు చెప్పితివి.రైతు కూలీలకు సంవత్సరానికి12 వేలు అంటివి 2సంవత్సరాలకు గాను 24000/-బాకీ పడ్డావ్.నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు అని చెప్పి మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నావ్,ఎటు పోయింది నీ జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి అని 33 నెలలకు 1లక్ష 32 వేలు బాకీ పడ్డావ్.నీ1000 రోజుల పాలనలో రాష్ట్రానికి మేలు చెయ్యకపోగా కీడు చేస్తున్నారు. పాలన చేతకాక పిచ్చిలేసి కారు కూతలు కుస్తున్నావు, కెసిఆర్తో నిన్ను పోల్చుకోవటం అంటే అది నిజంగా నందితో పంది పోల్చుకోవటమే.కెసిఆర్కి ఇచ్చే జీత భత్యాలు లెక్కగడుతున్నావు,మరి మీ తమ్ముళ్లకేం హోదా ఉంది అని ఈప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుంది.పాలన పక్కకు పెట్టి దోచుకోవటం, దాచుకోవటం తప్పా నువ్వేం చేసావు.ఈ రాష్ట్రానికి నువ్వొక రిబ్బన్ కట్టింగ్ ముఖ్యమంత్రి.మీ మెడలు వంచి అయినా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడితే మరి నువ్వెందుకు నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చావ్ సిగ్గు ఉండాలని మాటలకి చేతలకి. నోరు అదుపులో పెట్టుకో లేకుంటే ప్రజలే నిన్ను తరిమి కొడుతారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు,గ్రామ నాయకులు,యువజన నాయకులు,రైతులు,సోషల్ మీడియా నాయకులు, ఆయా మండలాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.