పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భారీ బైక్ ర్యాలీ

జనసైనికులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 2 (పోలవరం ఇంచార్జ్ రవి) జీలుగుమిల్లి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు జనసైనికులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జీలుగుమిల్లి ప్రధాన కూడలికి చేరుకుంది. అక్కడ పవన్ కళ్యాణ్ న్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం దర్భగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం దర్భగూడెం నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదినశుభాకాంక్షలుతెలియజేశారు.తదుపరి లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్థూపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, జనసేన మండల నాయకులు బండారు అనిల్, రూపా సత్యనారాయణ, కూటమి నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్, అఖిల్ బొల్లగాని, నెలటూరి మోహన్, శొంఠి రామకృష్ణ, కొప్పుల శ్రీకాంత్, తొమ్మిదేళ్ల దుర్గా ప్రసాద్, రాయి సుబ్బారావు, దేవుడు శ్రీను, అక్కిశెట్టి బలరాం, ప్రసాద్, తమ్మన సాంబ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *