
అక్షరాయుధం న్యూస్ రిపోర్టర్ కాలిశెట్టి శంకర్ సెప్టెంబర్ 2 పార్వతిపురం మన్యం జిల్లా పార్వతీపురం: దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.
ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం!