
సెప్టెంబర్ 2 అచ్చంపేట న్యూస్ అక్షర ఆయుధం రిపోర్టర్ కాలూరి మల్లేష్ *రాజీవ్ గాంధీ చౌరస్తాలో వైఎస్సార్‌కు అచ్చంపేట ఎమ్మెల్యే ఘన నివాళి*అచ్చంపేట పట్టణంలో దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అచ్చంపేట మాట్లాడుతూ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్సార్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కోట్లాది ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసాయని పేర్కొన్నారు. రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ పాలన సాగిందని కొనియాడారు.రాజీవ్ గాంధీ చౌరస్తాలో జరిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.మహానేత వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు మార్మోగడంతో రాజీవ్ గాంధీ చౌరస్తా ప్రాంగణం వైఎస్సార్ అభిమానులతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్. ఉమామహేశ్వర పాలకమండలి మాధవ రెడ్డి చైర్మన్, నరసయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ అచ్చంపేట ఎంపీపీ రామనాథం, మండల పార్టీ అధ్యక్షులు కటకం రఘురాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల. రాములు సలేశ్వరం. ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు సంతోష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది