విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ చేసిన ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ కంగ్టి సెప్టెంబర్, 02-2026. (రిపోర్టర్ హెచ్ రాజు)నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని
*చాప్టా కే గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో* విద్యార్థులకు దుస్తులు, షూస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శివాజీరావు చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు, షూస్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శివాజీరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు.పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. దుస్తులు, షూస్ అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఆయిషా సిద్ధిఖా, ఉపాధ్యాయులు ఎండీ అజీమొద్దీన్, గీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *