మాధవరంలో జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలాదేవికి ఘన స్వాగతం

ఇంటింటి ప్రచారంలో ప్రజలతో మమేకమైన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు
🖨️ Print

అక్షర ఆయుధం నవంబర్:1 రిపోర్టర్( బుయ్యన శ్రీను ) ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మాధవరం–చేరవల్లి గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలాదేవి, ఎంపీటీసీ అభ్యర్థి సున్నం మహేష్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం గ్రామానికి చేరుకున్న జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలాదేవికి ఎంపీటీసీ అభ్యర్థి సున్నం మహేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమై తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి బొంతు కోమలాదేవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. గ్రామాల్లో మరింత అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలన్నా, స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలన్నా తమకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలంతా తనను కుటుంబంలో ఒక ఆడబిడ్డగా భావించి ఆదరిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలు చూపిస్తున్న ఆదరణను ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కుండా సత్యనారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంజి రాంబాబు, ఉపాధ్యక్షుడు పత్తిపాటి అశోక్, జనసేన గ్రామ కన్వీనర్ ముదిగొండ రఫీ, కూటమి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *