చర్లలో రహదారి గుంతల సమస్యకు స్పందన! జేసీబీతో గుంతలను సర్దుబాటు చేయించిన సర్పంచ్ పూజారి సామ్రాజ్యం

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్:చర్ల,మండల రిపోర్టర్(నవంబర్1):భద్రాచలం–వెంకటాపురం ప్రధాన రహదారిపై వెటర్నరీ ఆసుపత్రి ఎదుట ఇసుక లారీల రాకపోకలతో భారీ గుంతలు ఏర్పడ్డాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గుంతలను పూడ్చేందుకు ఆర్ అండ్ బి అధికారులు గ్రావెల్ పోసినప్పటికీ,పది రోజులు గడిచినా సర్దుబాటు చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.ఈ సమస్యపై స్పందించిన చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం జేసీబీ సహాయంతో గ్రావెల్‌ను సర్దుబాటు చేయించి రహదారిని ప్రయాణానికి అనువుగా చేయించారు.దీంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది.సమస్య పరిష్కారానికి స్పందించిన సర్పంచ్ సామ్రాజ్యానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *