
అక్షర ఆయుధం న్యూస్ ఆర్మూర్ డివిజన్ తేది :~01-11-2026
తెలంగాణ రాష్ట్ర నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల దాసాంజనేయ మందిరం ఆవరణలో ఈరోజు (ఆదివారం, 01-11-2026) 78వ వారపు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రతి ఆదివారం ఒక గంట” అనే నినాదంతో సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక కాలనీ అభివృద్ధి కమిటీ సహకారంతో ఈ వారం దాసాంజనేయ మందిర పరిసరాలను శుభ్రం చేయనున్నట్లు వివరించారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, భక్తులు మరియు స్వచ్ఛంద సేవకులు అధిక సంఖ్యలో పాల్గొని, శ్రమదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ వాసులకు మా సభ్యులందరూ సుంకె శ్రీనివాస్ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని కృతజ్ఞతలు తెలిపారు
ఇట్లు,:~సుంకె శ్రీనివాస్, అధ్యక్షులు, మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ, ఆర్మూర్.