
అక్షర ఆయుధం న్యూస్ 01 నవంబర్ 2026 : (రిపోర్టార్ జి రాంబాబు)అల్లూరి జిల్లా. వార్త విశ్లేషణ : అల్లూరి జిల్లా – అరకు నియోజకవర్గం, ముంచింగిపుట్టు, ముంచింగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం వారపు సంత సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలు, పార్టీ నినాదాలతో మండల కేంద్రం సందడిగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరకు వేలీ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌరవ శెట్టి గంగాధర్ స్వామి పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంచింగిపుట్టు మండలం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మండలంలోని జడ్పీటీసీ అభ్యర్థి పాంగి మల్లికార్జున్, సుజనకోట సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి వెంగడ కాంతమ్మతో పాటు ఇతర ఎంపీటీసీ సెగ్మెంట్ల కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మనాద్, పార్వతమ్మ, ముత్యాలమ్మలను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: వెంగడ నీలకంఠం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం మాట్లాడుతూ.. “దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీది చారిత్రాత్మక పాత్ర. స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించింది. ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన ముంచింగిపుట్టు మండలంలోని రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, నిరుద్యోగం వంటి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల ముందుకు వచ్చారు. పదవులు అనేవి అధికారం చెలాయించడానికి కాదు.. ప్రజలకు సేవ చేయడానికి, వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి. అందుకే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంది” అని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు ఆదివాసీ హక్కుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి: పాంగి మల్లికార్జున్ ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి పాంగి మల్లికార్జున్ మాట్లాడుతూ.. “ఈ ఎన్నికలు కేవలం ఎంపీటీసీ , జడ్పీటీసీ స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. మన ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి, మన రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రజలు తమ తీర్పు చెప్పే ఎన్నికలు. మన భూములు, మన అడవులు, మన గ్రామసభల అధికారాలు, మన యువత భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 5వ షెడ్యూల్: ఆదివాసీ ప్రాంతాల రాజ్యాంగ పరిరక్షణ. 1/70 చట్టం: ఆదివాసీల భూముల రక్షణ. పిసా చట్టం – 1996: గ్రామసభలకు రాజ్యాంగ బద్ధమైన అధికారాలు. అటవీ హక్కుల చట్టం(ఎఫ్ఆర్ఏ) : అర్హులైన ఆదివాసీలకు అటవీ భూములపై హక్కులు.
గిరిజన యువతకు ఉపాధి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధన. ఈ హక్కులు కేవలం ఎన్నికల హామీలుగా మిగిలిపోకూడదు. ఆచరణలో అమలు కావాలి. మన గ్రామాలకు రోడ్లు రావాలి, ప్రతి ఇంటికి తాగునీరు అందాలి, రైతులకు సాగునీరు అందాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. విద్య, వైద్యం మెరుగుపడాలి. ఈ లక్ష్యాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలి. మన ప్రాంత అభివృద్ధి కోసం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి” అని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 5న హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి! రాబోయే 05-11-2026, గురువారం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి: సీరియల్ నంబర్ 3 – పాంగి మల్లికార్జున్. ఎంపీటీసీ అభ్యర్థులు: సీరియల్ నంబర్ 4 – వెంగడ కాంతమ్మ, తుమ్మనాద్, పార్వతమ్మ, ముత్యాలమ్మ (సంబంధిత సెగ్మెంట్లలో). ముంచింగిపుట్టు మండలంలో అభివృద్ధి, సంక్షేమం, ఆదివాసీ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని నాయకులు తెలిపారు. ప్రజల కోసం కాంగ్రెస్.. అభివృద్ధి కోసం కాంగ్రెస్.. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. ఈ ప్రసార కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, మండలం నాయకులు, పలు గ్రామాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
