
హుజురాబాద్.2( అక్షర ఆయుధం) లోనే .నరేష్.వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలను వాగ్దానాలను తుంగలో తొక్కి దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో బి ఆర్ ఎస్ ప్రజల సమక్షంలో ఎండగడుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని అన్నారు. గద్దినెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే నాయకుల పై తప్పుడు కేసులు పెడుతూ నిరంకుశ పాలన చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన పై బి ఆర్ ఎస్ పార్టీ సమరభేరీ కార్యక్రమం చేపడుతూ ప్రజలను ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు. వారం రోజుల పాటు రోజుకు ఒక అంశంపై రోజుకు ఒక మండలంలో ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం చేస్తుందన్నారు. ప్రజల పక్షాన పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కోలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్ రెడ్డి, గాంధె శ్రీనివాస్ తిరుపతిరెడ్డి పింగిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు