వైయస్సార్ కి ఘన నివాళి

🖨️ Print

బొబ్బిలి (అక్షర ఆయుధం ప్రతినిధి సతీష్ )దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బొబ్బిలి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి, వైఎస్సార్ విగ్రహానికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.రైతు సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతి, ఆరోగ్య భద్రత, విద్య, సాగునీటి రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు .జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత రైతుల ఆశలను నెరవేర్చేందుకు తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసిన ఘనత వైఎస్సార్ దే.వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల పక్షాన నిలబడి పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి, రామభద్రపురం మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *