గుంతకల్లు–ఓటు హక్కు వినియోగించుకున్న గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం….!

🖨️ Print

అక్షర ఆయుధం నవంబరు 1 గుంతకల్లు పట్టణం రిపోర్టర్ నూర్ మొహమ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుంతకల్లు (న్యూస్) :: ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో రూమ్ నెంబర్ 22/1 నందు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను, అదేవిధంగా గుంతకల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసి కానుకగా అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గుంతకల్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజల ఆదరణతో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించి ఆ విజయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.గుంతకల్ మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *