ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారుల ఘన విజయం: ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సి హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ అభినందనలు తెలిపారు

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ ఆర్మూర్ మండల్ ~తేది :~2•9•2026*”తెలంగాణ రాష్ట్ర” నిజమాబాద్ జిల్లా పోలీస్ శాఖ అసోసియేషన్ ఎన్నికల్లో నిన్న అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఆర్మూర్ డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎర్రపాటి శ్రీనివాస్ జిల్లా ప్రెసిడెంట్‌గా అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు.అదేవిధంగా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్ ఐ యాసిర్ అరాఫత్, ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా ఘన విజయం సాధించి ఎన్నికయ్యారు.జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఆర్మూర్ డివిజన్ కీర్తిని నిలబెట్టిన ఎర్రపాటి శ్రీనివాస్, యాసిర్ అరాఫత్, మరియు శ్రీజలను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికైన ప్రతినిధులు పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ అభినందనల కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *