
(అక్షర ఆయుధం న్యూస్: 02-09-2026. రాయికోడ్ మండలం ప్రతినిధి. డి. పవన్ కుమార్ కర్చల్.)సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పట్టణంలోని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మరియు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు, మహిళలకు ఆర్థిక సహాయం, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడు సంవత్సరాలకు చేరువ అవుతున్న ఈ సమయంలో కూడా అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, పేద కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కంటే, ఇచ్చిన ప్రతి హామీ అమలుపై ప్రజలకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని, ఏ హామీ అమలైంది, ఏది పెండింగ్‌లో ఉంది, ఎప్పుడు పూర్తి చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, న్యామాతబాద్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. బిరాదర్ అప్పారావు పాటిల్, హద్నూర్ మాజీ సర్పంచ్ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.