
అక్షర ఆయుధం న్యూస్ : అశ్వరావుపేట, నవంబర్ 1 ( రిపోర్టర్ నాగరాజు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండల కేంద్రంలో ప్రజల మధ్యే ఉంటూ, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులకు రాత్రింబవళ్లతో సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైంది. అశ్వారావుపేట మండలంలో నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకులు, ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా రాత్రి వేళల్లో సైతం ప్రజల మధ్య మమేకమై ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అశ్వారావుపేటలోని లక్కీ అపార్ట్మెంట్స్ 1 మరియు 2 లో గడపగడపకు వెళ్లి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. బిఆర్ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, అలాగే మాజీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణల అంకితభావం, నాయకత్వ పటిమ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమయంతో సంబంధం లేకుండా అపార్ట్మెంట్లోని ప్రతి ఇంటికి వెళ్లి, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ వివరించారు.