సీతంపేటలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

స్పెషల్ ఫెసిలిటేషన్ కేంద్రం.. ఓటు వేస్తున్న ఉద్యోగులు
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్: (తేదీ1 నవంబర్ 26) రిపోర్టర్ కె రాజశేఖర్ సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీడీవో బీబీ మిశ్రా సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎన్నికల విధులకు హాజరుకానున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే కారణంగా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును నేరుగా వినియోగించుకోలేని ఉద్యోగులకు ఈ ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి, ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *