ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఘన విజయం సాధించి ప్రజాసేవలో ముందుకు -సాగుతున్నా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..మిరియాల ప్రీతమ్
🖨️ Print

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (అక్షర ఆయుధం న్యూస్ ప్రతినిధి కృష్ణ): ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాన్య ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించు కున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మిరియాల ప్రీతమ్ తెలిపారు. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రజా సమస్యలపై స్పందిస్తూ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ప్రయాణం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతు పొంది ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకమని మిరియాల ప్రీతమ్ పేర్కొన్నారు. ప్రజలపై ప్రేమ, సేవా దృక్పథం, సమస్యలపై పోరాడే తత్వం ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని మిరియాల ప్రీతమ్ హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చేపట్టే ప్రతి ప్రజాసేవా కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *