వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళులు

అక్షర ఆయుధం సెప్టెంబర్ 2 ( మిర్యాలగూడ పి వెంకటయ్య) నల్లగొండ జిల్లా. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోబంగారుగడ్డలోని వైఎస్సార్ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా చిలుకూరి బాలకృష్ణ మాట్లాడుతూ, వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహానేత అని అన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.ప్రజల కోసం వైఎస్సార్ చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.