
నంద్యాల సెప్టెంబర్ 2 (అక్షర ఆయుధం న్యూస్)నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంత్రులు ఎన్ ఎం డి ఫారూఖ్ బిసి జనార్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి వైసిపి నేతలు ఇలాంటి డ్రామాలు చేస్తోందని విమర్శించారు. తండ్రి కొడుకులు చక్రపాణి రెడ్డి శిల్ప రవి కిషోర్ రెడ్డిలు కలిసి మంచి డ్రామాలాడుతున్నారు రైతుల మేలు కోసం కాదు కేవలం రాజకీయ ఉనికి కోసం ఈ డ్రామాలు అని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని రైతులకు ఏ విధంగా సాగునీరు అందించాలని అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు వైసిపి నేతల రాజకీయ ఆరోపణలు ప్రచారాలను రైతుల నమ్మవద్దని కోరిన ఎమ్మెల్యే రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రతి నిర్ణయం రైతు ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.