
అక్షర ఆయుధం న్యూస్ నవంబర్ 1 రిపోర్టర్ శివలింగం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్ల. నవంబర్ 1న ఢిల్లీలో జరగనున్న రామ్‌లీలా మైదాన్ మార్చ్‌లో పాల్గొనేందుకు వస్తున్న లక్షలాది మందికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఢిల్లీలోని స్థానిక దుకాణాల్లో షాపింగ్ చేయాలని కోరారు. దీపావళి, ఛఠ్, భాయ్ దూజ్ పండుగల వేళ చిన్న వ్యాపారులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ర్యాలీతో వ్యాపారులకు నష్టం జరుగుతుందంటూ బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మార్చ్, ర్యాలీ నిర్వహిస్తూనే స్థానిక వ్యాపారులకు మేలు చేసేలా కొనుగోళ్లు చేయాలని ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు