
బొబ్బిలి (అక్షర ఆయుధం ప్రతినిధి సతీష్ )వ్యవసాయ మరియు అనుబంధ శాఖల మండల స్థాయి అధికారుల సమక్షంలో గ్రామస్థాయి సిబ్బందితో మండల వ్యవసాయ అధికారి ఎం శ్యాంసుందర్ ఆధ్వర్యంలో బొబ్బిలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎల్ నినో ప్రభావం వలన పంటలు పడని ఏరియాని రాబోయే నాలుగైదు నెలలో ఏ విధముగా స్వల్పకాలిక మరియు తక్కువ నీరుతో పండే పంటలను రైతులు వేసుకునే విధంగా ప్రత్యామ్నాయ పంటలపై ఒక సమీక్ష మరియు, చర్చా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వరి పంటని ఇక ముందుగా వేసుకోకూడదని అలాగే ప్రత్యామ్నాయ పంట అయినటువంటి కట్టెజనుము రాగి నువ్వులు కొమ్ముసెనగ వేరుశనగ వంటి ప్రచ్చామాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పడని ప్రాంతాల్ని,ఈ పంటలతో రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించాలని రైతులకు చేదోడువాదులుగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఉద్యాన పంటలు గాని లేదా పశుగ్రాసం కూడా ప్రధానమైన ప్రత్యామ్నాయ, పంటగా తీసుకుని రైతులకు ముందుకు వెళ్లాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఉద్యాన అధికారి పిరిడి పక్కి మరియు పెంట వెటర్నరీ డాక్టర్లు ఇరిగేషన్ ఏఈ అదేవిధంగా ఏఎస్ఓ పాల్గొన్నారు.