Header
02 Nov 2026 | 03:40 PM

యువత రాజకీయాల్లోకి రావాలి మార్పు కోసం ముందడుగు వేయాలి మీ చింతిరాల అరుణ్ రాజ్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్

అక్షర ఆయుధం న్యూస్ నవంబర్ 1 భద్రాచలం టౌన్ రిపోర్టర్ రాయల శ్రీను రానున్న ఎంపిటిసి ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నాను మీరందరూ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నా చింతిరాల అరుణ్ రాజ్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలబడి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ రాబోయే ఎన్నికలు, భవిష్యత్తు వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని యువతకు పెద్దపీట వేస్తున్నాయి. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించేందుకు, అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ద్వారా దేశ భవిష్యత్తును మార్చడంలో జెన్-జీ (Gen-Z) మరియు యువత కీలక పాత్ర పోషించనుంది. ఎంపీటీసీగా నన్ను గెలిపించి మీ దీవెనలు అందించాలని కోరుతున్నా మీ అందరి అభిమానంతో మీ చింతిరాల అరుణ్ రాజ్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్