
అక్షర ఆయుధం సెప్టెంబర్ 2 ( మిర్యాలగూడ పి వెంకటయ్య) నల్గొండ జిల్లా. మిర్యాలగూడ: మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను 420 అడుగుల ఫ్లెక్సీపై ముద్రించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, వృద్ధులు, ఉద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలను హామీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, నల్లమోతు సిద్ధార్ధ, ఎండి.యూసుఫ్, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎండి.ఇలియాస్ ఖాన్, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్,అంగోతు హతిరాం నాయక్, ఎండి.మగ్దూం పాషా,ఎండి. మాజీద్,ధనావత్ బాలాజీ నాయక్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, కుర్ర సేవ్యా నాయక్,చౌగాని బిక్షం గౌడ్,కుందూరు వీరకోటి రెడ్డి, అమరావతి సైదులు యాదవ్,చిర్ర మల్లయ్య యాదవ్, పాలుట్ల బాబయ్య, వార్డు కౌన్సిలర్లు, ఇంచార్జ్ లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ కమిటీ నాయకులు, వార్డు ఇన్చార్జ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.