
అక్షర ఆయుధం న్యూస్ రిపోర్టర్ మేకల సతీష్ యాదవ్ వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. 1000 రోజులు దాటినా ఊసేలేదుమంత్రి జూపల్లి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలి: మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిచిన్నంబావి: అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో, కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందని, దానికి నిదర్శనమే మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన పెద్దదగడలో ప్రారంభమైన రాజకీయ మార్పు అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో రెండో వార్డు సభ్యులు కంచి జ్ఞానేశ్వరి–కరుణాకర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, రాముడు, పురేందర్, రమేష్, మునీశ్వర్, వెంకటేష్ గౌడ్, సుల్తాన్, శివశంకర్ తదితరులు ఉన్నారు. వారికి బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.మంత్రి సొంత గ్రామం నుంచే మార్పు మొదలైందిఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు 100 రోజులు కాదు.. దాదాపు 1000 రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలి. మంత్రి జూపల్లి సొంత గ్రామమైన పెద్దదగడ నుంచే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైంది. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన విషయం కాదు.. రాబోయే రాజకీయ మార్పుకు ఇది సంకేతం” అని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత గ్రామాన్ని 100 రోజుల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.100 హామీలు కాదు.. ఒక్క పని చూపించండి”
ఎన్నికల సమయంలో గ్రామానికి సీసీ రోడ్లు, ఇళ్లు, ఆలయ నిర్మాణం, బ్యాంకు, రైతు వేదిక వంటి అనేక అభివృద్ధి పనులు 100 రోజుల్లో చేస్తామని హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా అని కరుణాకర్ ప్రశ్నించారు.రచకట్ట దగ్గర నిలబడి 100 రోజుల్లో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తానని చెప్పారు. ఇళ్లు ఇస్తానన్నారు.. సీసీ రోడ్లు వేస్తానన్నారు.. బ్యాంకు ఏర్పాటు చేస్తానన్నారు.. రైతు వేదిక తీసుకొస్తానన్నారు. 100 రోజులు కాదు కదా.. 1000 రోజులు గడిచినా గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించలేదు. సమస్యలు చెప్పడానికి వెళ్తే ‘మీరు ఎవరో నాకు తెలియదు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక మాకు మీ హామీలపై నమ్మకం లేదు” అని కరుణాకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.మంత్రి గారూ.. రాజీనామా చేసి రండి.. మా హర్షవర్ధన్ రెడ్డి మీతో పోటీకి సిద్ధం”హర్షవర్ధన్ రెడ్డి మరింత ఘాటుగా స్పందిస్తూ..ప్రజలపై మీకు నిజమైన నమ్మకం ఉంటే.. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ధైర్యం ఉంటే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రండి. మీతో పాటు మా హర్షవర్ధన్ రెడ్డి కూడా ప్రజల మధ్య నిలబడతారు. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తేల్చుకుందాం” అనిసవాల్విసిరారు.ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా ఐదేళ్ల సమయం ఉందని, అయితే ప్రజలు మాత్రం తమ సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కరెంట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హర్షవర్ధన్ రెడ్డిగ్రామాల్లో విద్యుత్ పరిస్థితి దారుణంగా మారిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు సాగునీరు, విద్యుత్ విషయంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. చిన్నంబావి మండలంలో రైతులకు అవసరమైన విద్యుత్ సదుపాయాల కోసం వందల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, వైర్లు అందించిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. ఇప్పుడు రైతులు కరెంట్ కోసం, నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పంటలు వేసుకునే పరిస్థితి లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు” అని అన్నారు.చిన్నంబావి మండలం వరి ధాన్యం ఉత్పత్తిలో కీలక ప్రాంతంగా ఉన్నప్పటికీ, రైతుల సమస్యలను పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరు గ్యారంటీలు.. 420 హామీలు.. ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేశారో చెప్పాలి”కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు వందలాది హామీలు ఇచ్చిందని, వాటిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందిన హామీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రజలు అమాయకులు కాదు. సోషల్ మీడియాలో ఎవరు ఏం ప్రచారం చేస్తున్నారో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలకు తెలుసు. బీఆర్‌ఎస్ కార్యక్రమం విజయవంతమైతే ఓర్వలేక వెంటనే తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ఈ రోజు మీరు చేస్తున్న ప్రచారమే రేపు మీకు తిరిగి సమాధానం అవుతుంది” అని హెచ్చరించారు.
అక్రమ కేసులు, బెదిరింపులతో ప్రజా సమస్యలను ఆపలేరుప్రభుత్వాన్ని ప్రశ్నించే బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం.. బెదిరించడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేముంది? బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోం. ప్రజల కోసం పోరాడే ప్రతి కార్యకర్తకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. వేధింపులకు పాల్పడే అధికారులు, నాయకుల వ్యవహారాలను కూడా గుర్తుపెట్టుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.పెద్దదగడలో మొదలైన మార్పు.. కొల్లాపూర్‌లో ప్రభంజనంగా మారుతుంది”పెద్దదగడ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం స్వాగతించదగ్గ పరిణామమని హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.పెద్దదగడ ప్రజలకు హృదయపూర్వక స్వాగతం. గతాన్ని మర్చిపోయి మనమంతా ఒక్కటై గ్రామ అభివృద్ధి కోసం దుకు సాగుదాం. ఈ రోజు పెద్దదగడలో మొదలైన మార్పు రేపు చిన్నంబావి మండలం మొత్తం విస్తరిస్తుంది. ఆ తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక పెద్ద రాజకీయ ప్రభంజనంగా మారుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం” అని తెలిపారు.కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ప్రజల కష్టాలు కనిపించడం లేదా?”చిన్నంబావి మండలంలోని రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పంటలు వేసుకోలేని దుస్థితి నెలకొందని హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.రైతులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. కరెంట్ రావడం లేదు.. నీళ్లు రావడం లేదు.. పంటలు వేసుకోలేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గోపాల్‌దిన్నె నుంచి రైతులకు సాగునీరు అందించాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరం. ప్రజల కష్టాలను వెంటనే పరిష్కరించాలి” అని డిమాండ్ చేశారు.చిన్నంబావి మండలంలోనే మార్పుకు నాంది పలికిందని, పెద్దదగడ నుంచి ప్రారంభమైన ఈ రాజకీయ మార్పు రాబోయే రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుందని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.