
"అక్షర ఆయుధం న్యూస్" ఆర్మూర్ మండల్ ~ తేది :~2•9•2026*"తెలంగాణ రాష్ట్ర" నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పట్టణ కేంద్రంలోనిస్థానిక నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో బుధవారం (02.09.2026) నెలకు మొదటి బుధవారంపురస్కరించుకుని మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగేష్ శర్మ గురుస్వామి వారి పర్యవేక్షణలో ఉదయం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, అమ్మవార్లకు విధిపూర్వకంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం, విశేష అర్చనలు, హారతి, మంత్రపుష్ప కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.మధ్యాహ్నం 01:00 గంటల నుండి ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూర్ ధనంజయ్, ప్రధాన కార్యదర్శి కత్రాజీ ఉదయ్ కుమార్, కోశాధికారి సురేష్ చారి, ఉపాధ్యక్షులు కౌటిక విజయ్, సలహాదారులు హరి, ప్రచార కార్యదర్శి గటడి గంగమోహన్ లు సంయుక్తంగా మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అయ్యప్ప ఆలయ నిర్మాణ కర్త అయ్యప్ప శ్రీనివాస్ కు, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులకు, దాతలకు, పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మణికంఠ సేవా సమితి సభ్యులు లింగా రెడ్డి, గోవింద్ పేట్ గురుస్వామి, కర్తన్ నవీన్ స్వామి, వాడి అశోక్ గురుస్వామి, మహేందర్ స్వామి, యాదగిరి కిషన్ గురుస్వామి, సి.ఎ.టి. అశోక్ గురుస్వామి, ప్రవీణ్, గురుదత్తు గురుస్వామి, చందు గురుస్వామి, శుభం స్వామి, మీసాల రాజేశ్వర్ గురుస్వామి, రమణయ్య గురుస్వామి, మెడికల్ రాజేష్ స్వామి, ద్యాగ ఉదయ్ గురుస్వామితో పాటు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.ఇట్లు :~*ఓం స్వామియే శరణమయ్యప్ప"నవనాథ సిద్దుల గుట్ట మణికంఠ సేవా సమితి"ఆర్మూర్ డివిజన్ నిజమాబాద్ జిల్లా