
అక్షర ఆయుధం న్యూస్ 01 నవంబర్ 2026 : =రిపోర్టార్ జి రాంబాబు) అల్లూరి జిల్లా. వార్త విశ్లేషణ : అల్లూరి సీతారామరాజు జిల్లా - అరకు నియోజకవర్గం,అరకువెల్లి మండలం, బొండం గ్రామ పంచాయతీ,తమ సొంత గ్రామామైన బొండం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పాచిపెంట శాంతకుమారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు పూలమాలలు వేసి ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా “రావాలి కాంగ్రెస్.. కావాలి కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, గిరిజన హక్కులు, చట్టాలు మరియు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని, గిరిజన హక్కుల పరిరక్షణతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.