బూర్గంపహాడ్ లో ఘనంగా వైఎస్ఆర్ 17వ వర్ధంతి వేడుకలు

రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ

అక్షర ఆయుధం ప్రతినిధి శ్రీనివాస్ రావు బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 2 బూర్గం పహాడ్ మండల వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బూర్గంపహాడ్, సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, గ్రామాల్లోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పూలపెల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో గ్రామ కమిటీ నాయకులు కాటం వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో గల వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించారని, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భజన నరసింహారావు, గ్రామ సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, హుస్సేన్, పాషా, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్, భజన ప్రసాద్ కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిమ్మల హరీష్ యాదవ్, బీసీ సంఘం మండల అధ్యక్షులు దాసరి సాంబ, పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కేసుపాక రాజేష్, టౌన్ ఉపాధ్యక్షులు చిప్పరాజు , ప్రభాకర్, లక్ష్మీనారాయణ, మర్లపాటి నాగేశ్వరరావు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.