Header
02 Nov 2026 | 04:57 PM

ప్రజాకవులజయంతి ప్రజల గొంతుకలజయంతి వట్టికోట ఆళ్వారు గూడఅంజయ్య జయంతి ప్రజల మనిషి ,ప్రజాకవి ల జయంతి

అక్షర ఆయుధం వనపర్తి అదివారం(01..11.2026) జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మోజీ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రజల మనిషి, గంగు నవల రచయిత, వట్టికోట ఆళ్వారుస్వామి 111జయంతి ని మరియుసెలయేరుల ఊట వుసిల్లపుట్ట, తేనెలొలికే పాటల సింగిడి ప్రజాకవి గూడ అంజయ్య 71వజయంతిని మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ మాట్లాడుతూ నిజాం రాచరిక పాలను అంతమొందించేందుకు తన రచనలతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి న కమ్యూనిస్టు నేత ప్రచురణ కర్త పాత్రికేయుడు సేవాశీలి ఉద్యమకర్త ప్రచారకుడు పౌరహక్కుల నేత గ్రంథాలయోద్యమ కారుడు ప్రజ్ఞాశాలి నలగొండ ఆంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు అన్నింటికి మించి తెలుగులో రాజకీయ నవలకు ఆద్యుడు అని అన్నారు . ప్రజల భాషను తన సాహిత్యంలో రుచి చూపించి తెలంగాణ నూడి కారణాలతో ఎన్నో రచనలకు వట్టికోట పెద్దపీట వేశారు ఎన్నో రచనలు చేశాడు ఆయన రచనలు నిబద్ధత వాస్తవికత దాగి ఉంటుంది ఆ కోవకు చెందిన ప్రముఖ తెలంగాణ రాజకీయ తొలి నవల ప్రజల మనిషి మన తెలంగాణలో రాచరిక వ్యవస్థ కారణంగా జాగీర్దార్ జమీందారుకు ఏ విధంగా నగదు కారు ఆ నవలలో వట్టికోట అక్షరాలతో బొమ్మ కట్టారుకావున వట్టి కోట మహా గట్టి కోట అన్నారు . గూడ అంజయ్య గూడ అంజయ్య ప్రపంచ పీడిత జన ప్రతినిధి దళిత దిక్కార గొంతుక పక్క విప్లవోద్యమ ప్రేమికుడు ఆకాంక్షలను లక్ష్యాలను మార్చుకుని తలవంచుకుని పోతున్న వారి మధ్య మళ్ళీ జన్మంటూ ఉంటే మిగిలిపోయిన తన స్వప్నాన్ని నిజం చేసుకోవడానికి కొనసాగింపుగా పిడికిలి బిగించి వాగ్దానం చేస్తూ నిష్క్రమించిన ప్రజల మనిషి అన్నారు దనికులను, పీడితులను వేరు చేసి నిలబెట్టాడు చివరికి కూలినాలి జనాలను కదిలించి తమతో వెట్టి చాకి రి చేయించుకుంటున్న దొరలను ఊర్లో నుంచి తరిమేల చేసిన చైతన్య జ్వాలఊరు మనదిరా ఈ వాడ మనదిరా పాట ,ఇక ఎగబడు దాంరో వేములవాడ రాజన్న, అంటూ భద్రం కొడుకో కొడుకు కుమరన్న జర పైలం కొడుకు అంటూ ,నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు నేను రాను కొడుకో యములున్న దావఖాన కు అంటూ లచ్చులో లచ్చన్న ఈ లుచ్చా గల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకు అంటూ నిలదీస్తూ ఎన్నో పాటలు రాసినటువంటి దిక్కార కవి నిగూఢమైన కవి గూడ అంజయ్య అన్నారు ,అయ్యో నీవా నువ్వు అవొడివా తెలంగాణ తోటి పాలోడివ,ఆంధ్ర పెత్తందారుల పై తన కలం కదిలించి, ఉస్మానియా ప్రాంతం లో ఉదయించిన కిరణమా గజ్జలు గజ్జలు రెండు గజ్జలో రాజన్న అంటూ తెలంగాణ పౌరుషాన్ని చాటిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి గూడ అంజయ్య పాట అని కొనియాడారు . ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజచారి కవి శ్రేష్టుడు డాక్టర్ నాయక కంటి నరసింహ శర్మ చింతకుంట కుర్మయ్య , బహుజన టీచర్స్ నాయకులు వడ్డేమాన్ రాములు పి ఆర్ టియు నాయకులు మాధవాచారి యుటిఎఫ్ నాయకుడు తిమ్మప్ప విద్యార్థులు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .