
అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ సెప్టెంబర్ 3, అక్షర ఆయుధం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ గుడివాడ అమర్నాథ్ స్థానిక చోడవరం కొత్తూరు జంక్షన్ లో గల వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా విరాజిల్లిందని ప్రతి అర్హునికి సంక్షేమ ఫలాలు అందేవని ప్రజలు ఈనాడు గుర్తు చేసుకుంటున్నారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్సుల దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ వరకు ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈనాటికి గుర్తు ఉన్నాయని ఆయనను ప్రజలంతా ఇప్పటికీ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారని తెలిపారు.మహానేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి గొప్ప కార్యక్రమాలు ప్రపంచానికే దిక్సూచిగా నిలిచినటువంటి కార్యక్రమాలు, అలాంటి మహానేత మన మధ్య నుంచి దూరమై 17 సంవత్సరాలైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య అనకాపల్లి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ ,డివిఆర్, ఏడువాక సత్యారావు, చందు రాంబాబు తదితర వైసిపి నాయకులతో పాటు చోడవరం నియోజకవర్గం 4 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానుల